Begin typing your search above and press return to search.

NTR Defends Trivikram, Educates Critics!

By:  Tupaki Desk   |   18 Oct 2018 7:05 AM GMT
NTR Defends Trivikram, Educates Critics!
X
త్రివిక్రమ్ టాలెంట్ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక త్రివిక్రమ్ రచనలో కామెడీ టచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ త్రివిక్రమ్ తాజా చిత్రం 'అరవింద సమేత' లో ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గిందని అంతటా వినిపించిన అభిప్రాయం. మరోవైపు సినిమాలో కొన్ని పాత్రలకు కామెడీకి స్కోప్ ఉన్నా ఒక 'ఆకు..పోక' సీక్వెన్స్ తప్ప మిగతా ఎక్కడా కామెడి వర్క్ అవుట్ కాలేదని అన్నారు.

ఇదే విషయం త్రివిక్రమ్ ను అడిగితే హీరో తన తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు కామెడీ చేయడం బాగుండదని అందుకే హీరో పాత్ర అలా ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ విషయం పై మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్(క్వశ్చన్స్!) ఇచ్చాడు. "అసలు త్రివిక్రమ్ ఎప్పుడూ కామెడీ సినిమాలే ఎందుకు చేయాలి? అయనకు ఎంతో టాలెంట్ ఉంది. దానికి తగ్గట్టు అన్ని రకాల స్టోరీస్ రాయాలి. అయన ఎందుకు తనను తాను కామెడీకే పరిమితం చేసుకోవాలి?" అన్నాడు.

అంతే కాదు త్రివిక్రమ్ స్టైల్ లో యంగ్ టైగర్ ఒక కామెడీ పంచ్ కూడా పేల్చాడు. "రేపు త్రివిక్రమ్ కనుక 'పురానీ హవేలీ' పేరుతో ఒక హారర్ ఫిలిం చేసి అందులో ఫుల్లుగా కామెడీ ని చొప్పిస్తే.. ఆ కామెడీ ఎలిమెంట్ ను చూసి షాక్ అయ్యి మెయిన్ దెయ్యం క్యారెక్టర్ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది" అన్నాడు. నిజమే.. ఇదేదో అలోచించాల్సిన విషయమే కదా?