Can Mahesh Impress This Time At Least?

Update: 2020-01-23 06:47 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ విదేశీ విహారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌ర్య‌ట‌న ముగించి తిరిగి రాగానే వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఎంబీ 27 చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. హీరోయిన్.. న‌టీన‌టులు.. సాంకేతిక నిపుణుల‌ను ద‌ర్శ‌కుడు ఎంపిక చేస్తున్నారు. రెండు నెల‌ల సుదీర్ఘ‌ వెకేష‌న్ లో మ‌హేష్‌ ఉంటారు కాబ‌ట్టి ఈలోపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొత్తం పూర్తి చేసి రెడీగా ఉంటార‌ట‌. అంటే స‌రిగ్గా స‌మ్మ‌ర్ లో షూటింగ్ మొద‌ల‌య్యే వీలుందని భావిస్తున్నారు. మ‌హ‌ర్షి ఫ‌లితం ఫ‌ర్వా లేద‌నిపించింది కాబ‌ట్టి మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రిపీట‌వుతుండ‌డం పై మ‌హేష్ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

అయితే మ‌హ‌ర్షి లాంటి క్లాస్ ట‌చ్ ఉన్న మూవీ త‌ర్వాత మ‌హేష్ ని ఈసారి వంశీ ఎలా చూపించ‌నున్నాడు? అన్న‌దానికి ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం అవుతోంది. ఈసారి మ‌హేష్ ని ఓ గ్యాంగ్ స్ట‌ర్ గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని.. పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ సినిమాని బాలీవుడ్ లోనూ రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. గ‌త కొన్నాళ్లు గా వంశీ డిఫ‌రెంట్ జాన‌ర్లు ఎంచుకుంటున్నాడు. ఆ కోవ‌లోనే తాజాగా డిఫ‌రెంట్  స్క్రిప్టు ను ఎంచుకున్నారట‌. అయితే ఈ సినిమా క‌థాంశానికి  సంబంధించిన మ‌రో కొత్త పాయింట్ తాజాగా రివీలైంది. ఎంబీ 27లో మ‌హేష్ గ్యాంగ్ స్ట‌ర్ గా క‌నిపించినా.. సీక్రెట్ ఏజెంట్ గా వేరొక షేడ్ ఉంటుంద‌ని లీక్ అందింది.

అంతేకాదు.. ఇప్ప‌టికే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేశారట‌. ఎంచుకున్న క‌థాంశానికి త‌గ్గ‌ట్టుగా `ఏజెంట్` అనే టైటిల్ ని నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. ఏజెంట్ చిత్రం ఆద్యంతం గ‌గుర్పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని వంశీ డిజైన్ చేశార‌ట‌. అందుకోసం ప్ర‌ఖ్యాత‌ హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల‌ ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఇదే గ‌నుక నిజ‌మైతే సూప‌ర్ స్టార్ కృష్ణ ఆయ‌న అభిమానుల‌ చిర‌కాల కోరిక తీరిన‌ట్లే. మ‌హేష్‌ ను జేమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌లో చూడాల‌ని చాలా కాలంగా క‌ల‌లుగంటున్నారు. మీడియాకు సైతం ఆ విష‌యాన్ని ప‌లుమార్లు వెల్ల‌డించారు. తాజాగా ఏజెంట్ టైటిల్ తో అభిమానుల్లోనూ అంచ‌నాలు అమాంతం పెరిగే వీలుంది. మ‌హేష్ ఇంత‌కు ముందు `వంశీ` (బి.గోపాల్) చిత్రంలో బాండ్ త‌ర‌హా పాత్ర‌ లో న‌టించినా ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. అందుకే ఎట్టి ప‌రిస్థితి లో బాండ్ 007 త‌ర‌హా సినిమాలో న‌టించి మెప్పించాల‌న్న పంతం మ‌హేష్ లోనూ చాలా కాలంగా ఉంది. అందుకే ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ఆ త‌ర‌హా క‌థాంశాన్ని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News