Corona again 18 thousand new cases in the country

Update: 2021-03-07 14:06 GMT
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 18వేల కేసులు నమోదైతే అందులో 10వేల కేసులు మహారాష్ట్ర నుంచే నమోదు కావడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా 108 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 53 మంది మరణించారు. 70 శాతం కొవిడ్‌ మరణాలు కోమార్బిడిటీస్‌ ఉన్న వారిలోనే సంభవిస్తున్నాయి.

కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం ఉద్దవ్ ఠాక్రే సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు.

దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ జోరు పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పరీక్షలు జరిపి, రోగులను గుర్తించి వైద్యం చేయాలనే వ్యూహం ఫలించింది. గత ఏడాది కొవిడ్‌ దేశంలో బాగా అదుపులోకి వచ్చింది. కేసులు బాగా ఉన్న రాష్ట్రాలను అదే వ్యూహం అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.

దేశంలో 82 శాతం కొత్త కేసులు మహారాష్ట్ర,కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1.94 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. రోగులను గుర్తించి వెంటనే వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం ఆదేశించింది. తద్వారా కేసుల కట్టడి చేయాలని రాష్ట్రాలను సూచించింది.


Tags:    

Similar News